చంద్రబాబును అభినందించిన తానా ప్రతినిధులు

చంద్రబాబును అభినందించిన తానా ప్రతినిధులు

ముద్ర, ఆంధ్రప్రదేశ్: ఊహించని విజయాన్ని సొంతం చేసుకుని, త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుణ్ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మాజీ ప్రతినిధులు సతీష్ వేమన, జయరాం కోమటి మంగళవారం అభినందించారు. విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు స్వగృహంలో కలిసిన వీరిద్దరూ టీడీపీ అధినేతతో విజయోత్సాహాన్ని పంచుకున్నారు. గత రెండు నెలలుగా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినందుకు తమ నేతతో కలిసి ఆనందం పంచుకున్నారు. వీరితో పాటు గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా విజయం సొంతం చేసుకున్న పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు.