డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజుపై టీఎస్‌ఎంసీ యాక్షన్

డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజుపై టీఎస్‌ఎంసీ యాక్షన్
  • రిజిస్టర్‌‌ నుంచి పేరు తొలగింపు
  • నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆదేశాలు అమలు
  • ఉత్తర్వులు విడుదల చేసిన స్టేట్‌ కౌన్సిల్‌ చైర్మన్

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజు పేరు తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ నుంచి తొలగిస్తున్న టీఎస్‌ఎంసీ చైర్మన్‌ డాక్టర్‌‌ వి.రాజలింగం ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఓ పోలీసు కేసు కోసం తప్పడు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు టీఎస్‌ఎంసీ సుగుణాకర్‌‌రాజుపై చర్యలకు పూనుకుంది. 6 నెలల పాటు ఆయన పేరును రోజిస్టర్ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సుగుణాకర్‌‌రాజు ఎలాంటి వైద్య సేవలు అందించేందుకు వీలు లేకుండా పోయింది. మరోవైపు ఆయన జనగామ జిల్లా ఆస్పత్రి సూరింటెండెంట్‌గా పదవి కూడా గడం పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ పదవిలో అర్హులైన మరొకరి నియమించేందుకు వైద్యశాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం.