మేమెవర్నీ మేనేజ్ ​చేయలేదు

మేమెవర్నీ మేనేజ్ ​చేయలేదు
  • కోట్లు గడించామనడం అబద్ధం
  • మిల్లింగ్​పై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది
  • రైస్​మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర

ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికారులను, లీడర్లను మేనేజ్ చేసుకుంటూ కోట్ల లాభాలు గడిస్తున్నామని చెప్పడం అబద్ధమని, మమ్మల్ని దొంగలుగా ముద్ర వేస్తున్నారని తెలంగాణ రైస్​మిల్లర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. మంగళవారం హైదరాబాద్​లో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్​రాష్ట్ర అధ్యక్షుడు గన్ఫా నాగేంద్ర మాట్లాడారు. గ్రామస్థాయి మొదలు కలెక్టర్ వరకు మిల్లింగ్ వ్యవస్థపై పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఎఫ్సీఐ కూడా ప్రత్యక్షంగా తమపై సూపర్ విజన్ చేస్తుందన్నారు. ఒకవేళ మేనేజ్​చేయాలంటే.. ఎంతమందినని మేనేజ్ చేస్తామని, ఇది ఆచరణలో సాధ్యమయ్యే పనైనా అని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు.. ఇప్పటికి దాదాపే ఏడింతలకుపైగా ధాన్యం దిగుబడి పెరిగిందని, రెండింతలు కూడా మిల్లుల సంఖ్య పెరగలేదన్నారు. అయినా సీఎంఆర్ విజన్​నువిజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. 

  • కొర్రీలు పెడుతూ బియ్యాన్ని తిరస్కరిస్తున్నారు..

ప్రతి చిన్న దానికి కొర్రీలు పెడుతూ బియ్యాన్ని తిరస్కరించడమే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ కావలసినంత గోదాముల స్పేస్ ఇవ్వడం లేదని నాగేంద్ర తెలిపారు. రాక్ మూమెంట్ పెంచడం లేదని, వాగన్లు కేటాయించకపోవడంతో తమ లారీలు రోజుల తరబడి ఎఫ్​సీఐ గోదాముల ముందు పెడుతున్నామన్నారు. ఇందువల్ల ట్రాన్స్​పోర్ట్ వెయిటింగ్ చార్జీలకే మిల్లర్లు అత్యధిక డబ్బు ఖర్చవుతోందన్నారు. యాసంగి ధాన్యంలో మన దగ్గర విపరీతమైన ఎండల వేడి ద్వారా నూక శాతం పెరగడంతో బాయిల్డ్ కు మాత్రమే పనికొస్తుందన్నారు. ఇప్పుడు అకాల వర్షాలతో చాలాసార్లు తడిసిన ధాన్యం దానికి కూడా పనికిరాకుండా పోతుందన్నారు. సమావేశంలో సోమనర్సయ్య, నర్సింగ్​రావ్​, వెంకటేశ్వరరావు, బప్రభాకర్​రావు, బాలేశ్వర్​గుప్తా, బొమ్మ రాజేశ్వర్​రావు పాల్గొన్నారు.