సొంతగూటికి చేరుకున్న యువ కాంగ్రెస్ నాయకులు

సొంతగూటికి చేరుకున్న యువ కాంగ్రెస్ నాయకులు

బారాస నాయకులను తయారు చేసుకోవాలి కానీ, లాక్కోకూడదని హితవు

ముద్ర ప్రతినిధి, వనపర్తి : పెబ్బేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ  నాయకులు గత రెండు వారాల క్రితం బారాసలో చేరిన విషయం తెలిసిందే, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ యువ నాయకులు వల్లపురెడ్డి హేమంత్ రెడ్డి, గంధం ఆంజి, మిత్ర బృందం ఈరోజు వనపర్తి పట్టణ కేంద్రంలో మాజీ మంత్రివర్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ జి. చిన్నారెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యువతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని రాబోయేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ అని తెలిపారు. బారాస నాయకత్వాన్ని సృష్టించేది కాదని, అవినీతిని సృష్టించే పార్టీ అని ఆరోపించారు అధికార బారాస చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పి కొట్టాలని హితువు పలికారు, ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, ఎద్దుల విజయ వర్ధన్ రెడ్డి, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెబ్బేర్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారపాకుల వెంకట్రాములు, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాపర్ల రామ్ రెడ్డి, వనపర్తి టౌన్ అధ్యక్షులు చీర్ల చందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాములు, టౌన్ మైనార్టీ అధ్యక్షులు జాంగిర్, పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దివాకర్ యాదవ్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు రోహిత్ తదితరులు పాల్గొన్నారు.