వనపర్తి లో  అన్ని అంగులతో నూతన వ్యవసాయ మార్కెట్

వనపర్తి లో  అన్ని అంగులతో నూతన వ్యవసాయ మార్కెట్
Vanaparthi new agricultural market

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో 43 ఎకరాల సువిశాల విస్తీర్ణం గల స్థలంలో నూతన వ్యవసాయ మార్కెట్ను నిర్మించి,  అన్ని వసతులు కల్పించడంతో రైతుల కష్టాలు తీరాయి. వనపర్తి జిల్లా కేంద్రానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో చిట్యాల శివారులో 43 ఎకరాల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వ్యవసాయ మార్కెట్ కు సేకరించడం జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక సుమారు 44 కోట్ల వ్యయంతో రెండు గోదాములు, ఓపెన్ షెడ్లు,  ఫ్లాట్ ఫారమ్స్, ఇంటర్నల్ రోడ్లు,  కార్యాలయ భవనం,  ఫలహారశాల,  హమాలీలకు, దడవాయులకు వెయిటింగ్ హాల్స్మ, రుగుదొడ్లు,  డ్రింకింగ్ వాటర్ తదితర సౌకర్యాలను కల్పించడం జరిగింది.

పాత మార్కెట్ లో ఇరుకైన స్థలంలో సీజన్లో మార్కెట్లో విక్రయానికి అవకాశం లేకపోవడంతో ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు కిలోమీటర్ల మేర రోడ్లపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కేవలం 5000 మంది రైతులు విక్రయానికి వస్తేనే పాత మార్కెట్ లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుత మార్కెట్లో 50వేల మంది రైతులు సరుకులను తీసుకొని వచ్చినప్పటికీ వాటిని ఆరబోసి విక్రయించే వరకు మార్కెట్లోనే ఉండేవిధంగా రైతులకు,  ధాన్యానికి భద్రత, 9భరోసా ఉండే విధంగా నిర్మించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి డాక్టర్ జి చిన్నారెడ్డి వ్యవసాయ మార్కెట్ కు స్థల సేకరణ చేయగా వ్యవసాయ శాఖ మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన మార్కెట్ కు నిధులు మంజూరు చేయించి దగ్గరుండి నిర్మాణం చేయించారు. దీంతో జిల్లాలోనే కాక నాగర్కర్నూల్ జిల్లా నుండి కూడా రైతులు వనపర్తి వ్యవసాయ మార్కెట్ కు వచ్చి వారి, వేరుశెనగ, ఇతర ధాన్యాన్ని విక్రయించుకొని వెళ్తున్నారు. అన్ని హంగులు,  వసతులు ఉండడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 ఒడిదుడుకుల మధ్య వేరుసెనగ ధరలు

 వనపర్తి వ్యవసాయ మార్కెట్లో రోజు మారుతూ రైతులను కంగారు పెడుతున్నాయి. వ్యాపారుల జిమ్మిక్కులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో పల్లి ధర ప్రస్తుతం 9000 పైన ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ, కొందరి రైతులకు మాత్రమే అధిక ధరను కేటాయించి ఎక్కువ శాతం తక్కువ ధరలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80% మంది రైతులకు 6000కు దిగువన ధర ఇస్తూ కేవలం 20 శాతం మంది రైతులకు తొమ్మిది వేలకు పైగా ధరలు కేటాయిస్తూ మార్కెట్లో ఎక్కువ ధరకు ఇస్తున్నామని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ అధికారులు కూడా వ్యాపారులు,  ట్రేడర్లకు తాళం కొడుతూ తమకు తీరని నష్టాన్ని కలిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.