మంచినీరు రావడం లేదని ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకోబోయిన మహిళలు యువకులు అరెస్ట్

మంచినీరు రావడం లేదని ఎమ్మెల్యే కాన్వాయ్ ని అడ్డుకోబోయిన మహిళలు యువకులు అరెస్ట్
  • గత ఐదారు నెలలుగా తుంగతుర్తిలో మంచినీటి కొరత నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో గత ఐదు ఆరు నెలల నుండి మంచినీళ్లు అరకొరగా వస్తున్నాయని గత పది రోజులుగా అసలు మంచినీరే రావడంలేదని ఆగ్రహించిన పలువురు గ్రామస్తులు ఖాళీ బిందెలతో శుక్రవారం నాడు ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు .ఈ సందర్భంగా గృహలక్ష్మి చెక్కుల పంపిణీ వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్ కి అడ్డంగా వచ్చిన యువకులను పోలీసులు అప్రమత్తతతో అరెస్టు చేసి స్టేషన్ తరలించారు .మహిళలను ఎమ్మెల్యేకు అడ్డువేలకుండా పక్కకు నెట్టివేశారు. దీంతో మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు .తమకు మంచినీళ్లు రావడం లేదని ఎన్ని మార్లు అధికారులకు గ్రామపంచాయతీ వారికి చెప్పిన ఫలితం శూన్యమైందని ప్రస్తుతం వర్షాకాల సీజన్ అయినా తమకు మంచినీళ్లు రాక వేసవికాలం మాదిరిగానే ఉందని వారంటున్నారు .ఇకనైనా అధికారులు స్పందించి తమకు అనునిత్యం మంచినీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యక్రమాలు పూర్తయ్యేంతవరకు యువకులను పోలీస్ స్టేషన్ లో ఉంచారు.