ప్రయత్నం ముగిసింది ఫలితం తేలాల్సి ఉంది?

ప్రయత్నం ముగిసింది ఫలితం తేలాల్సి ఉంది?
  • ముగిసిన ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారాలు
  • మూగబోయిన లౌడ్ స్పీకర్లు, మైక్ సెట్లు 
  • వైన్ షాపులు, బెల్ట్ షాపులు బంద్

హుజూర్ నగర్ ముద్ర: తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30 తేదీన జరగబోయే ఎన్నికలకు ప్రచార సమయం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత నెల రోజులుగా పార్టీలు ప్రచార వాహనాలకు భారీ లౌడ్ స్పీకర్లను అమర్చి నిర్వహించిన ప్రచారాల కారణంగా విలువడే రణగోణ ధ్వనులతో ప్రజలు విసుగెత్తిపోయినా ఎలక్షన్ ఫీవర్ తో గ్రామాలు పట్టణాలు నగరాలు మాత్రం సందడిగా కనిపించాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెనర్లు ప్రజలకు దర్శనం ఇచ్చారు. ఎన్నికల మూలంగా సామాన్య ప్రజలకు ఎన్నికల ప్రచారానికి కావాల్సిన సామాగ్రిని తయారు చేసే వారికి మంచి ఉపాధి దొరికినట్లు అయింది. ఈనెల 28 ,29, 30 మూడు రోజుల పాటు వైన్ షాపులు , బెల్ట్ షాపులు బంద్ చేయనున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారి పై కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుండే ఆయా పార్టీ అభ్యర్థులు ఎవరికి వారే తీసిపోని విధంగా పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలను నిర్వహించారు. అభివృద్ధి మంత్రంగా టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కాపాడుకునేందుకు కాంగ్రెస్ జాతీయవాదం పై బిజెపి నమ్మకం పెట్టుకోగా ప్రజలు ఎవరికి అధికారాన్ని కట్టబెడతారనేది ఆసక్తిగా మారింది. హుజూర్ నగర్ ఎన్నికల్లో చాలా పార్టీల నుండి అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ,బిజెపి, ఏఐఎఫ్ బీ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. కాంగ్రెస్ కంచుకోటను కాపాడుకుంటుందో బీఆర్ఎస్ మరోసారి చరిత్రను తిరగరాస్తుందో బిజెపి ,ఏఐఎఫ్ బి లు ఎంత మేరకు తమ సత్తా చాటుతాయో వేచి చూడాల్సి ఉంది.