అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి..

అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలి..

ముద్ర, గంభీరావుపేట : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ వచ్చి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న  ఇప్పటి వరకు గంభీరావుపేట మండలంలో ఒక్కరికి కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కొన్ని గ్రామాల్లో డబల్ బెడ్ రూమ్  ఇప్పటివరకు మొదలు పెట్టలేదని అన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నాసిరకంగా కట్టారని,  ఎక్కడ నాణ్యత పాటించలేదని అన్నారు. గంభీరావుపేట మండలంలో బుధవారం ప్రారంభించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నాలుగు సంవత్సరాల క్రితమే పూర్తయ్యాయని,  అప్పుడు పంపిణీ చేయకుండా, ఎలక్షన్ స్టంట్ లో భాగంగా ఇప్పుడు ప్రారంభిస్తున్నారని  అన్నారు.  మంత్రి కేటీఆర్ మాటలు నమ్మి పరిస్థితిలో గంభీరావుపేట ప్రజలు లేరు అని అన్నారు. ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేదా గృహలక్ష్మి మంజూరు  చేయాలనీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లబ్ధిదారులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు మహేష్ యాదవ్, కృష్ణకాంత్ యాదవ్, ఓబీసీ జిల్లా కార్యదర్శి మేకర్తి శ్రీనివాస్,జిల్లా కార్యవర్గ సభ్యులు దేవయ్య, మండల ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, బంధారపు దేవేందర్ గౌడ్ , బీజేవైఎం మండల అధ్యక్షులు విగ్నేష్ గౌడ్,ఓబీసీ మండల ఉపాధ్యక్షులు స్వామి,ఓబీసీ మండల ప్రచార కార్యదర్శి నాయకపు నరేష్,దేవరాజు, బట్టు ప్రవీణ్, దేవరాజు, రాకేష్,సర్వోత్తం, శ్రీనివాస్ యాదవ్,   ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.