చెన్నమనేని అక్కడ... చల్మెడ ఇక్కడ..

చెన్నమనేని అక్కడ... చల్మెడ ఇక్కడ..
  • చల్మెడకు పోటీగా ఏనుగు,న్యాలకొండల పర్యటనలు
  • వేములవాడ నియోజకవర్గంలో ఆశావాహుల పర్యటనల జోరు 
  • చల్మెడ, ఏనుగు, న్యాలకొండ లు ఎవరి పర్యటనలు వారివే..
  • హైదరాబాద్ లో చెన్నమనేని.. వేములవాడలో ఆశావాహుల విస్తృత పర్యటనలు
  • శుభాకార్యలు, మెడికల్ క్యాంపులు, పరామర్శల పేరుతో నియోజకవర్గాన్ని జల్లెడ పడుతున్న చెన్నమనేని వ్యతిరేఖవర్గం

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ  నియోజకవర్గ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వేములవాడ బీఆర్ఎస్ టికెట్ ఆశీస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుకు వ్యతిరేఖంగా వేములవాడ లో ఆఫీస్ ఓపెన్ చేసి తన కార్యక్రమాలు తాను చేసుకుంటున్న విషయం విదితమే.దీనికి తోడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చల్మెడకు పరోక్షంగా సహకరిస్తూ.. సిరిసిల్ల పర్యటన వచ్చినప్పుడల్ల పిలుసుకోని..వెంటేసుకోని తిరగడం.. అతి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సైతం రెడ్డి సామాజిక వర్గం నుంచి తనకు ఎమ్మెల్యే గా అవకాశం కల్పించాలని కోరుతూ.. చాలా రోజుల నుంచే వేములవాడ నియోజక వర్గంలో పర్యటనలు చేస్తూ.. రాజకీయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. మండలాల వారిగా తన వర్గాన్ని కాపాకుంటూ.. ప్రతి రోజుల ఏదో ఒక పర్యటన చేస్తూ జనంలో ఉంటున్నాడు. ఎమ్మెల్యే రమేశ్ బాబు అనుమతి లేనిది వేములవాడ లో కూడా అడుగుపెట్టని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి..ఎమ్మెల్యేతో కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ..ఇప్పుడు ఏకంగా వేములాడ నియోకవర్గ పర్యటనలు ప్రారంభం చేసింది. పలు శుభకార్యాలు, పరామర్శలు, గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధులను కలుస్తూ..తన ప్రభాల్యం కూడా చాటుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడంతో... వేములవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అంతుచిక్కడం లేదు. కోనరావుపేట మండల  కేంద్రంలో ఎమ్మెల్యే రమేశ్బాబుకు వ్యతిరేఖంగా బీఆర్ఎస్ యూత్ సమావేశాన్ని నిర్వహించిన చల్మెడ వైద్య సంస్థల అధినేత చల్మెడ లక్ష్మీనరసింహరావు మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యేగా నేను ఒక్కడినే బీఆర్ఎస్ టికెట్ అడగటం లేదు.. ఐదుగురు ఆశీస్తున్నారు.. ఎవరికి వచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం చెప్పినట్లు పని చేస్తామని ప్రకటించారు. ఈ వాఖ్యలు వేములాడ నియోకవర్గంలో చర్చనీయంశంగా మారాయి. ఎవరు ఆ ఐదుగురు అని నియోకవర్గ ప్రజల్లో ఒక చర్చ మొదలైంది.

ప్రస్తుతం చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఏనుగు మనోహర్ రెడ్డి రాజకీయాల్లో యాక్టీవ్గా ఉండి టికెట్లు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. తాజాగా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి నియోజకవర్గ పర్యటనలు ప్రారంభించాడు. ఈ సంఖ్య మూడుకు చేరింది. మరో ఇద్దరు ఆశావాహులు ఎవరా అని పలువురు చర్చించుకుంటున్నారు. వేములవాడ అర్బన్ మండల సెస్ డైరక్టర్ రేగులపాటి హరిచరణ్ రావు, బీఆర్ఎస్ మొదటి నుంచి మద్దతుగా ఉంటూ.. దుబాయ్ లో తెలంగాణా వాదం ఎత్తుకున్న జువ్వాడి శ్రీనివాస రావు ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్టు సిట్టింగులకు దక్కుతుందా..? లేక ఆశావాహుల్లో ఎవరికైన దక్కుతుందా ఎవరికి అంతుచిక్కడం లేదు. ఏది ఏమైన .. చల్మెడ లక్ష్మీనరసింహరావు మాత్రం ప్రస్తుతం ట్రెండింగ్ ఉండి.. విస్తృతంగా రోజుకో మండలం మెడికల్ క్యాంపులు, పరామర్శలు, ఇతర కార్యక్రమాల పేరుతో పర్యటనలు చేస్తున్నాడు. ఏనుగు మనోహర్ రెడ్డి సైతం దేంట్లో తగ్గడం లేదు. వేములవాడ నియోజకవర్గంలో ఆశావాహులు విస్తృత పర్యటనలు చేస్తుంటే.. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు హైదరాబాద్ లో తిష్ట వేసి.. అధిష్టాన పెద్దలను కలిసేందకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.