బి.అర్.ఎస్ మ్యానిఫెస్టో చరిత్రాత్మకం 

బి.అర్.ఎస్ మ్యానిఫెస్టో చరిత్రాత్మకం 
  • జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ 

ముద్ర ప్రాతినిధి, జగిత్యాల: బి.అర్.ఎస్ మ్యానిఫెస్టో చరిత్రాత్మకమని జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ అన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఆదివారం కె.సి.ఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో బి.అర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి టపాసులు కాల్చి సంబురాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా దావ వసంతసురేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారనీ, అందుకు అనుగుణంగానే పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించారని పేర్కొన్నారు.

మళ్లీ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు దారులకు 5లక్షల జీవిత భీమా,రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.16వేలు,వృద్ధాప్య పింఛన్ క్రమంగా రూ. 2016 నుండి ఐదు సంవత్సరాల్లో 5016,దివ్యాంగులకు రూ.6016కు పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించడం హర్షనీయమన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలకూ అండగా నిలుస్తామని మ్యాని ఫెస్టోలో చేర్చడం చరిత్రాత్మకమన్నారు. పార్టీ ప్రచారం లో భాగంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి మున్సిపల్ చైర్మెన్ గోలి శ్రీనివాస్, జెడ్పీటీసీ మహేష్,పాక్స్ చైర్మెన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు, మహిళలు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.