చంద్రబాబు కస్టడీ పిటిషన్​ రేపటికి వాయిదా

చంద్రబాబు కస్టడీ పిటిషన్​ రేపటికి వాయిదా

ముద్ర, తెలంగాణ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈ రోజు సెలవులో ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టు ఇన్‌చార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వ్యవహరించారు.