పరిశుద్ధంతోనే పట్టణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం

పరిశుద్ధంతోనే పట్టణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం
  • హుజూర్ నగర్ పట్టణాన్ని పారిశుద్ధ్యంలో అగ్రస్థానంలో నిలపాలి
  • తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్యనికి పెద్దపీట
  • ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: పారిశుద్ధ్యం తోనే పట్టణ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు గురువారం పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 18వ వార్డులో 8 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి స్వచ్ఛభారత్ దివస్ ఇండియన్ స్వచ్ఛత లీక్ లో పాల్గొని మాట్లాడుతూ పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల్లో ఉన్న వ్యర్ధాలను తొలగించడంవలన పట్టణాలు సుందరంగా రూపుదిద్దుకుంటాయని అన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ నియోజవర్గానికి 25 కోట్లు కేటాయించడం, దానికి సంబంధించిన జీవో కూడా అందించారని అన్నారు. గతంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధిని తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుందని అన్నారు. గతంలో ఎక్కడికి వెళ్లినా గ్రామాల్లో మురుగునీరు ప్రత్యక్షమై వ్యాధులు ప్రబలించేవని, కానీ ప్రస్తుతం ఎక్కడ చూసినా సిసి రోడ్లు డ్రైనేజీలు ప్రత్యక్షమయ్యాయని అన్నారు. దీనివల్ల అంటూ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని, అక్టోబర్ 1న ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా స్వచ్ఛత హిసేవ , ఏక్ తారీక్, ఏక్ గంట, శ్రమదన్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కుంట సునీత సైదులు, ఎరగని గురవయ్య, బిఆర్ఎస్ ముఖ్య నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.