ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి  - కలెక్టర్  వరుణ్ రెడ్డి.

ఇంటిగ్రేటెడ్ క‌లెక్ట‌రేట్ నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి  - కలెక్టర్  వరుణ్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ లో జరుగుతున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను యుధ్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నూతన సమీకృత కలెక్టరేట్ భవన  నిర్మాణ పనులను   జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి,  అదనపు కలెక్టర్ రాంబాబు తో   కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చేతుల మీదుగా నిర్మ‌ల్ ‘సమీకృత కలెక్టరేట్‌’ను ప్రారంభించేందుకు  సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.  అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌’ భ‌వ‌న స‌ముదాయాన్ని ఈ నెలలో ప్రారంభోత్సవం  చేయ‌నున్న‌ట్లు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని గదులలో  ఏర్పాట్లను  పరిశీలిస్తూ,  అధికారుల‌కు తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రాంగణంలో గార్డెనింగ్, మొక్కలు నాటడం సుందరీకరణ పనులు త్వ‌రిత‌గతిన పూర్తి చేయాల‌న్నారు. బార్డర్ ప్లాంటేషన్  చేయాలని,  ఆహ్లాదకరమైన  పచ్చని వాతావరణం కల్పించేలా  మొక్కలను  నాటి వాటిని సంరక్షించాలని,  వెహికల్స్ పార్కింగ్, హెలిప్యాడ్  తదితర పనులను పరిశీలించారు. కలెక్టరేట్ చుట్టూ మొక్కలు నాటాలని,  నాణ్యత ప్రమాణాలు  పాటించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను  ఆదేశించారు.