జనం నుంచి వనంలోకి..

జనం నుంచి వనంలోకి..
Nagulamma Jathara

 - ముగిసిన నాగులమ్మ జాతర

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీ నర్సాపురంలో కొలువై ఉన్న శ్రీనాగులమ్మ ఆలయంలో మార్చి 7వ తేదిన మండె మెలుగుట కార్యక్రమంతో మొదలైన శ్రీనాగులమ్మ జాతర శనివారం అమ్మవార్లు వన ప్రవేశం చేయడంతో ముగిసింది. జాతరలో చివరి రోజైన శనివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం ఆలయ మేనేజింగ్ ట్రస్ట్రీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ ( దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగరమేష్, సడాలమ్మ పూజారి కొమరం ధనలక్ష్మి, బాడిశ నవీన్, ఇతర పూజారులు, వడ్డెల ఆధ్వర్యంలో శ్రీనాగులమ్మ, సడాలమ్మ అమ్మవార్లకు రహస్య పూజలు , అభిషేకాలు, జెండా కర్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అందరికీ శుభం కలగాలని వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం శ్రీనాగులమ్మను ఆలయ మేనేజింగ్ ట్రస్ట్రీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ ( దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగరమేష్ లు డోలు వాయిద్యాల నడుమ గండొర్రె గుట్టకు, సడాలమ్మను సడాలమ్మ పూజారి కొమరం ధనలక్ష్మి, పూజారులు, వడ్డెలు యెర్రెట్టల గుట్టకు చేర్చారు. ఈ కార్యక్రమంలో పూజారులు, వడ్డెలు మడకంలక్ష్మయ్య , సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, ఈసం సమ్మక్క, కుర్సం నరేష్ , కారం రాజేష్ , చౌలం భవాని,  కొర్స శ్రీకాంత్, ముయబోయిన శివ, కారం రమాదేవి, సోడి శివ నాగేశ్వరి , మడకం సుప్రజ, కుల పెద్దలు కుర్సం విష్ణుమూర్తి, మడకం రాజేశ్వరరావు, శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు బాడిశ ఆదినారాయణ, ఇందారపు రమేష్, గట్టిపల్లి  అర్జున్, కొమరం రవి, కనుకుంట్ల నాగరాజు, చిట్యాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.