కోదాడ లో పర్యావరణ ఉద్యమకారుడు నామినేషన్ దాఖలు

కోదాడ లో పర్యావరణ ఉద్యమకారుడు నామినేషన్ దాఖలు

ముద్ర ప్రతినిధి , కోదాడ : కోదాడ అసెంబ్లీ నియోజకవర్గానికి బుధవారం పర్యావరణ ఉద్యమకారుడు కొల్లు లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు . ఆయన తన నివాసం నుండి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ వరకు పర్యావరణ ప్రాముఖ్యతను వివరించే నినాదాలు చేస్తూ మొక్కలను పట్టుకొని , నామినేషన్ పత్రాలను కూడా జూట్ బ్యాగ్ తగిలించుకొని అందులో పెట్టుకొని నామినేషన్ దాఖలు చేసేందుకు అనుచరులతో కలిసి వెళ్లారు . రోడ్డు పై మొక్కలను పట్టుకొని , క్లాత్ బ్యానర్ పై పర్యావరణ ప్రాముఖ్యతను వివరించే విధంగా నినాదాలు వ్రాయించి దానిని పట్టుకొని రోడ్డు పై వెళుతుండటంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు .