హైదరాబాద్ -శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ -శ్రీశైలం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
dcm and car accident in hyderabad
  • మహేశ్వరం మండలం తుమ్మలూర్ గేటు వద్ద డిసిఎం -కారు ఢీ
  • నలుగురు దుర్మరణం

ముద్ర, రంగారెడ్డి ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారి తుమ్మలూరు గేట్ సమీపంలో (మ్యాక్) వద్ద డీసీఎం కారు ఢీకొని నలుగురు మృతి చెందినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

వీరంతా హైదరాబాదులో జరిగిన శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి కారులో వస్తుండగా తెల్లవారు జామున ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని సమాచారం. మృతులు.. రామస్వామి, యాదయ్య, శ్రీనివాసులు, కేశవులుగా గుర్తింపు.