డీఎస్ కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నాడు..

డీఎస్ కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నాడు..
  • ఆయన వారసుడే అరవింద్
  • ఆర్మూర్ టికెట్ అమ్ముకొని కోరుట్ల లో పోటీ..
  • అభివృద్ధి చేసే నాయకుడు సంజయ్
  • ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు

మెట్‌పల్లి ముద్ర: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో   ధర్మపురి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ టికెట్లను గాంధీ భవన్ లో పంపిణీ చేయకుండా తన ఇంట్లో ఉండి అమ్ముకున్నాడని ఆయన వారసుడు ధర్మపురి అరవింద్ ఆర్మూర్ లో పోటీ చేస్తానని జీవన్ రెడ్డి కి సవాల్ విసిరి డబ్బులకు అమ్ముడుపోయి ఆ టికెట్ వేరే వ్యక్తికి కేటాయించి అరవింద్ కోరుట్ల లో పోటీ చేస్తున్నాడని. కోరుట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. గురువారం ఆయన స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే గా నియోజకవర్గాన్ని అభివృద్ధి లో ముందుంచాడని ఇప్పుడు నియోజకవర్గ  ప్రజలకు ఉచిత విద్య, వైద్యం మాత్రమే అవసరం ఉందన్నారు. వాటిని అందించగల సమర్థుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గతంలో ఎందరో మెట్‌పల్లిలో ఎమ్మెల్యే లు గా గెలుపొందారని ఎవరు చేయని అభివృద్ధి విద్యాసాగర్ రావు చేశాడన్నారు. ఇక్కడి నుండి పోటీ చేయబోతున్న జువ్వాడి నర్సింగరావు కు పదవి వ్యామోహం తప్ప అభివృద్ధి ఆలోచన లేదన్నారు. ఆయన తండ్రి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తన నియోజకవర్గంలో బీసీ వ్యక్తి ఎమ్మెల్యే గా గెలిస్తే రాజీనామా చేయించిన ఘనుడు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా అభివృద్ధి చేయలేదన్నారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ను వదిలి ఆర్మూర్ లో జీవన్ రెడ్డి పై పోటీ చేస్తానన్నాడని అక్కడ ఓ బిజినెస్ మాన్ అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వడంతో కోరుట్ల లో పోటీ చేస్తున్నాడని అన్నారు. ఎంపీ గా  పార్లమెంట్ సెగ్మెంట్ ను అభివృద్ధి చేయని వ్యక్తి ఎమ్మెల్యే గా ఎమ్ చేస్తాడని ప్రశ్నించారు. ఎంత మంది కోరుట్ల నియోజకవర్గంలో పోటీలో ఉన్నా అంతిమ విజయం అభివృద్దిదే అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ను ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.