విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం చేసిందేమీలేదు

విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రభుత్వం చేసిందేమీలేదు

ముద్ర ప్రతినిధి, జనగామ: నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులకు చేసిందేమీలేదని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు చిలువేరు  అభిగౌడ్ విమర్శించారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని 29వ వార్డులో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకుడు తారిక్ ఇలాహి ఆధ్వర్యంలో జరిగిన సంఘ మీటింగ్‌కు  అభితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎం.డి జానీమియా (ముస్తఫా), ఎండి గౌస్ ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిగౌడ్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు అన్ని వసతులతో కూడిన కళాశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జనగామ జిల్లాగా ఏర్పడిన ఏళ్లు గడుస్తున్న ఎలాంటి మార్పు సాధించలేదన్నారు. జనగామ జిల్లాలో ఉన్న ఏకైక మైనారిటీ హాస్టల్‌ కూడా టీఆర్‌‌ఎస్‌ లీడర్ల పైరవీలతో అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఆ పాఠశాలలో టీఆర్ఎస్ నాయకుల రాజకీయాలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉందన్నారు. తారీక్ ఇలాహి మాట్లాడుతూ జనగామలో మైనార్టీ విద్యార్థులు, యువతకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఎన్‌ఎస్‌యూఐ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి మంతపురి ప్రభు కిరణ్‌, ముఖ్య నాయకులు మజర్ రాజేష్, అజయ్ శానవాజ్, ఆప్షన్ బాబా, అఖిల్, అమీర్, సోను, సయ్యద్ మజీద్ పాల్గొన్నారు.