పోలీస్ ఉద్యోగాలు పొందిన 11 మందికి సన్మానం - సర్పంచ్ షేక్ సలీమా రంజాన్

పోలీస్ ఉద్యోగాలు పొందిన 11 మందికి సన్మానం - సర్పంచ్ షేక్ సలీమా రంజాన్

హుజూర్ నగర్ టౌన్ ముద్ర: తెలంగాణ ప్రభుత్వం బుధవారం తెలిపిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో హుజూర్నగర్ మండలం బూరుగడ్డ మాచవరం గ్రామానికి 11 మంది విద్యార్థులకు కానిస్టేబుల్ ఉద్యోగం రావడం పట్ల ఆ గ్రామ సర్పంచ్ శుక్రవారం వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే గ్రామం నుండి 11 మంది విద్యార్థులు పోలీసు ఉద్యోగానికి ఎంపిక కావడం ఎంతో ఆనందకరమైన విషయమని, వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి రేపటి తరం పిల్లలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండుసైదులు ,ఆవుల వెంకటయ్య , గూడెపు నాగలింగం ,ఉడతల సతీష్, తాళ్ల వెంకటేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.