కుటుంబ పెద్దగా కెసిఆర్- ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

కుటుంబ పెద్దగా కెసిఆర్- ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇంటి ఆడబిడ్డల పెళ్ళిలో ఆర్థికంగా ఆదుకుని ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నారని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. బాసర మండలకేంద్రంలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కెసిఆర్ ప్రభుత్వం అమలు  చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని అన్నారు. అనంతరం 17 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.