ఈడీ నుంచి రాని రిప్లై.. ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్సీ కవిత

ఈడీ నుంచి రాని రిప్లై.. ఢిల్లీకి పయనమైన ఎమ్మెల్సీ కవిత

దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఫిబ్రవరి-9న రావాలని నోటీసులో ఈడీ పేర్కొనగా.. 15న వస్తానని అధికారులకు కవిత లేఖ రాశారు. అయితే.. కవిత రెక్వెస్ట్‌పై ఈడీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనేదానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కవిత కోరినట్లు 15న ఈడీ విచారణకు అనుమితిస్తుందా..? లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 9,15 తేదీల్లో కాకుండా మరోరోజు పిలుస్తుందా..? అనేదానిపై మరో గంటల్లో పూర్తి స్పష్టత అవకాశం కనిపిస్తోంది. నోటీసులు వస్తాయని ముందు నుంచే బీఆర్ఎస్ శ్రేణులు భావించాయని సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.

ఈడీ నుంచి వచ్చే రిప్లయ్‌ను బట్టి ఢిల్లీకి బయల్దేరాలని మొదట కవిత భావించారు. అయితే.. ఈడీకి లేఖ రాసి గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాధానం లేకపోవడంతో ముందుగా అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే కవిత ఢిల్లీకి బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. అంతకుముందు ప్రగతిభవన్‌కు వెళ్లిన ఆమె.. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అవ్వాలని భావించారు. కానీ.. సమయం లేకపోవడంతో కవితకు ఫోన్‌ చేసిన కేసీఆర్ సుమారు 15 నిమిషాలపాటు ఈడీ నోటీసులు, న్యాయ సలహాలపై చర్చించాక కవిత ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియవచ్చింది. కవితతోపాటు బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఢిల్లీ వెళ్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.