60 ఏళ్లు ఏం చేశారు? | Mudra News

60 ఏళ్లు ఏం చేశారు? | Mudra News
  • నిరుపేదల ఆర్థికాభివృద్ధికి కృషి..
  • అందరికీ విద్య అదే మా నినాదం..
  • అవినీతిపై ఉక్కుపాదం మోపుతాం..
  • నీది, నాదీ, కులం, మతం అనే బేదభావాలను తొలగిస్తాం..
  • నవభారత సమాజాన్ని నిర్మిస్తాం..
  • కాంగ్రెస్​, మిత్రపక్షాలు ‘మోఢీ’ని ఎదురుకోలేరు..
  • దేశ ప్రజల నమ్మకం, విశ్వాసమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది..


న్యూఢిల్లీ: నాదీ, నీది, కులం, మతం, వర్గం, వర్ణం అన్న బేదభావం భారతీయుల్లో లేకుండా చేయడమే తమ లక్ష్యమని, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం తమ చివరి శ్వాస వరకూ పనిచేస్తామని, భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో నెం.1గా నిలబెడతామని, భారత్​పై విమర్శలు చేసే వారికి తగిన రీతిలో బుద్ధిచెబుతామని, కాంగ్రెస్​దాని మిత్రపక్షాలైన ప్రతిపక్షాలకు దేశాన్ని అగౌరవపర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారని నేడు భారత్​ను ప్రపంచంలోనే ప్రత్యేక స్థానంలో నిలబెట్టి సమాధానం చెప్పామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. 


రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. 22 గంటల విద్యుత్​ను అందజేస్తున్నామని, హర్​ఘర్​ జల్​ మిషన్​ ద్వారా 11 కుటుంబాలకు నీరు అందించామని, ప్రతీ గ్రామంలోని నిరుపేదలకు జన్​ధన్​ఖాతాలతో బ్యాంకులను చేరువ చేశామని మోడీ అన్నారు. 2047ను లక్ష్యంగా పెట్టుకొని పెద్ద అడుగు (లక్ష్యం) వేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. అవినీతిపరుల భరతం పడతామన్నారు. ఆదివాసీలు, గిరిజనుల మేలు కోసం 110 జిల్లాల్లో విద్య కోసం1.20 కోట్ల కేటాయింపు జరిగిందన్నారు. 500 ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిన్నకారు రైతులకు సంవత్సరంలో మూడుమార్లు కిసాన్​ మిత్ర ద్వారా నేరుగా బ్యాంకులో డబ్బులు అందజేస్తున్నామన్నారు. మహిళల స్వావలంభన కోసం అనేక చర్యలు తీసుకున్నామన్నారు. మహిళా సంఘాలు, గర్భిణీలకు ఉచిత పథకాలు, ఆకాశమంత ఎత్తుకు ఎదిగేందుకు ముద్ర లోన్లు, కుటుంబంలో మహిళలకు కూడా ఆస్తిహక్కు, ఆర్మీ నియామకాల్లో మహిళలకు చోటు ఇవన్నీ చాలాని బీజేపీ ప్రభుత్వం ఎంటో చెప్పడానికన్నారు. ఉజ్వల పథకం ద్వారా 32 కోట్ల కుటుంబాలకు గ్యాస్​ కనెక్షన్లను ఇప్పటివరకూ అందజేశామన్నారు. దేశ నవ యువకులు సాంకేతికంగా దూసుకుపోయేందుకు అనేక కార్యక్రమాలు తీసుకువచ్చామన్నారు. స్టార్టప్​ల వృద్ధి, ఇన్​ఫ్రాస్ర్ట్చక్చర్​, విద్యావిధానంలో మార్పు చేర్పులు, రుణాలు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామన్నారు. చదువుకున్న యువత నేడు సొంత శాటిలైట్​లను అభివృద్ధి చేసే స్థాయికి ఎదగడం గర్వకారణమన్నారు. దేశంలోని అభివృద్ధి పనులను, దేశ భద్రతను చూస్తున్న ప్రజలు బీజేపీ పార్టీకి మరింత దగ్గరవుతున్నారన్నారు. అమృతకాలంలో అవినీతి లేని, నీతి నిజాయితీ పాలన, నాదీ నీదీ, కులం, మతం అనే బేదభావం లేని పాలననందించడమే తమ లక్ష్యమని మోడీ స్పష్టం చేశారు.


‘హస్తా’నికి ఝలక్​
60 ఏళ్ళుగా పాలించిన కాంగ్రెస్​ దేశానికి ఏం చేసిందని అవినీతిని, ఉగ్రదాడులను, బీదరికాన్ని, వెనుకబాటుతనాన్ని, అభివృద్ధిని దరిచేరనీయలేదని మోడీ ఆరోపించారు. 2014లో విద్యకు రూ. 20వేల కోట్లు కేటాయించారన్నారు. ప్రస్తుతం రూ. 1.20లక్షల కోట్లు కేటాయించామన్నారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాలలో 60 ఏళ్ళలో 23 పట్టాలిస్తే తాము 8 ఏళ్ళలోనే 80 వేల భూహక్కు పట్టాలిచ్చామన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన కీలకమైన వ్యక్తుల్లో ఆదివాసీలు, గిరిజనులు కూడా ముందువరుసలో ఉంటారని కితాబిచ్చారు. అలాంటి గ్రామాలను ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్​ అన్నారు. గ్రామాల్లో విద్యుత్​ కోసం పోల్స్​ వేశేవారని దాని కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదన్నారు. నేడు 18వేల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో విద్యుత్​ను అందించామన్నారు. దీంతో నిరుపేదలకు కూడా బీజేపీ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం పెరిగిందన్నారు. నమ్మకం, విశ్వాసమే దేశ భవిష్యత్తుకు, అభివృద్ధికి పునాదులని మోడీ స్పష్టం చేశారు. అవినీతిపరుల గుండెల్లో మోడీ పేరు వింటే దడ పుట్టాలన్నారు. పుట్టేలా చేస్తానన్నారు. ఇలాంటి చవకబారు చర్యలతో దేశాన్ని 60 పాలించిన కాంగ్రెస్​ దేశపునాదులను బలహీనపర్చిందని మోడీ ఆరోపించారు. కానీ ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఉందని, ఉంటుందని భారతదేశ పునాదులను సరిచేస్తున్నామని ప్రపంచంలో భారత్​ శక్తిని చాటుతున్నామని అన్నారు. ‘ఒక్క మోడీ’ ని ఎదుర్కొనేందుకు ఎంతమంది కాంగ్రెస్​, దాని మిత్రపక్షాల సభ్యులకు కూడా చేతకావడం లేదన్నారు. అదే భారతదేశ ప్రజలు తనపై, తమ పార్టీపై ఉంచిన నమ్మకం, విశ్వాసం అన్నారు.