సౌభాగ్యలక్ష్మి పథకంతో పేద మహిళలకు భరోసా

సౌభాగ్యలక్ష్మి పథకంతో పేద మహిళలకు భరోసా
  • సూర్యాపేటలో లో మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి ఇంటింటి ప్రచారం
  • రెండవ వార్డ్  కోమటికుంట  లో ప్రచారం నిర్వహించిన సునిత జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు భరోసానిస్తుందని సూర్యాపేట బిఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునీత జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం పట్టణంలోని 2వ వార్డు కోమటి కుంట లో ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ,   సౌబాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల రూ.3000 ఇవ్వనున్నట్లు తెలిపారు.భవిష్యత్‌ భద్రత బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం అన్న సునిత జగదీష్ రెడ్డి,బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్దిని వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ బడుగు,బలహీన, మైనార్టీ వర్గాల అభ్యన్నతికి పెద్దపీట వేశారన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి ఓటు వేసి అభివృద్దికి తోడ్పడాలన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి  పాలన లో సాధించిన ప్రగతి విప్లవం వల్ల నియోజకవర్గంలోని గ్రామాలకు గుండె ధైర్యం వచ్చిందన్నారు. సూర్యాపేట నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈనెల 30 న మీ అమూల్య ఓటు ను కారు గుర్తుకు వేసీ మరొసారి ఆశీర్వదించి అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని కోరారు.