చేనేత ఐక్యవేదిక యువజన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రవితేజ

చేనేత ఐక్యవేదిక యువజన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రవితేజ

ముద్ర, మల్యాల: తెలంగాణ చేనేత ఐక్యవేదిక యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన గుండేటి రవితేజ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా రవితేజ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమo కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. రవితేజకు పద్మశాలి సంఘం పెద్దలు, వివిధ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.