మొద్దు నిద్రలో ఆర్టీసీ అధికారులు

మొద్దు నిద్రలో ఆర్టీసీ అధికారులు
  • విద్యార్థుల జీవితాలతో చెలగాటం
  • ప్రమాదపు అంచున విద్యార్థుల ప్రయాణం

ముద్ర,తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి తంగళ్ళపల్లి మండలంలోని మండెపల్లి మోడల్ స్కూల్ వరకు చదువుకోవడానికి  నిత్యం వెళ్లే విద్యార్థులు సుమారు 400 వరకు ప్రయాణిస్తారు. మరియు మండేపల్లి లోని ఐటిఐ కళాశాలలో, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ చదువుకోడానికి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. విరందరూ  ఉదయం వేళ సమయానికి పాఠశాలకు చేరుకోవాలంటే బస్సులు సమయానికి రావాలి సరైన సమయం లేక బస్సులు రావడం వలన ఒక్కో బస్సుల్లో 200 విద్యార్థుల వరకు ప్రయాణం చేయడం వలన బస్సులో కిక్కిరిసి డ్రైవర్లు బస్సు టాప్ పైన విద్యార్థులను కూర్చోబెట్టుకొని నిత్యం తీసుకెళ్తున్నారు.దీనిలో భాగంగా మంగళవారం ఉదయం యధావిధిగా పాఠశాలకు వెళ్తున్న బస్సు ని ఆపి విద్యార్థులను తల్లిదండ్రులు బస్సు పై నుండి దింపడం జరిగింది .ఏదైనా ప్రమాద సంఘటన జరిగితే ఎవరుబాధ్యులని,వెంటనేప్రభుత్వం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు విద్యార్థులకు సమయానికి బస్సులు కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ఈ సంఘటనపై "ముద్ర" డిపో మేనేజర్ మనోహర్ ని వివరణ కోరగా బుధవారం రోజు నుండి ప్రత్యేకంగా విద్యార్థులకు మూడు వేళలో  సరైన సమయానికి అందుబాటులో కేటాయిస్తామని మొదటి బస్సు ప్రయాణం 7:30 రెండవ బస్సు ప్రయాణం 8 గంటలకు మూడో బస్సు ప్రయాణం ఎనిమిదిన్నరకు సాయంత్రం వెళలో 4:45 కు రెండు బస్సులు 5:30 కి ఒక బస్సు కొనసాగుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించగలరని కోరారు.