పేదల పోరాట స్పుర్తికి దిక్సూచి సాంబ శివుడు

పేదల పోరాట స్పుర్తికి దిక్సూచి సాంబ శివుడు
  • భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి 

భువనగిరి (ముద్ర న్యూస్ ): భువనగిరి పట్టణంలోని స్థానిక అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి పోలిటిబ్యూరో సభ్యులు కొనపూరి సాంబశివవుడి 12వ వర్ధంతి  ఘనంగా జరిగింది. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సాంబ శివుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొనపూరి కవిత రాములు వలింగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ కొనపురి సోదరుల అభిమాన ఆత్మీయులతో కలిసి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంబ శివుడు పేదల పోరాటానికి దిక్సూచి గా నిలిచాడని కొనియాడారు.

కుటుంబసభ్యులు, అభిమానులతో స్తూపం వద్ద పెద్ద ఎత్తున జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి ఘననివాళి  అరిపించారు. గ్రంధాలయ చైర్మన్ జెడల అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ కొల్పుల అమరేందర్, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు మరియు జెడ్పీటీసీ బీరుమల్లయ, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, పిఎసిఎస్  చైర్మన్ నోముల పరమేష్ రెడ్డి బీఆర్ఎస్వీ  రాష్ట్ర నాయకులు తొట్ల స్వామీ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ  అధ్యక్షులు ఏ వి కిరణ్ జనగాం పాండు జిహెచ్ఎంసి కార్పొరేటర్ లు జడ్పిటిసి  సర్పంచులు, ఎంపీటీసీ లు,  బిఆర్ఎస్ పార్టీ నాయకులు సాంబశివుడు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.