విద్యార్థి యువత ముందు చూపు తోటే మాధక దవ్యాలను నియంత్రణ సాధ్యం - ఎస్సై లోకేష్

విద్యార్థి యువత ముందు చూపు తోటే మాధక దవ్యాలను నియంత్రణ సాధ్యం - ఎస్సై లోకేష్

మాదకద్రవ్యాల నివారణ  కోసం డివైఎఫ్ఐ రూపొందించిన స్టిక్కర్లు విడుదల చేసిన - ఎస్సై 

మునగాల ముద్ర: విద్యార్థి యువత ముందు చూపుతోటే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమని ఎస్సై లోకేష్ అన్నారు, శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు మాదకద్రవ్యాల నివారణ కోసం డివైఎఫ్ఐ  రూపొందించిన స్టిక్కర్లను వారు స్థానిక డివైఎఫ్ఐ నాయకులు మరియు పోలీస్ సిబ్బందితో కలిసి  విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్న వయసులోనే విద్యార్థి యువత మాదక ద్రవ్యాలు మత్తు పానీయాలు, నిషేధిత గంజాయి లాంటి  మత్తుమందులు తీసుకుంటూ తమ చక్కటి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడంతో పాటు కుటుంబ వ్యవస్థను కూడా ఆగం కావడానికి కారణం అవుతున్నారని, డివైఎఫ్ఐ లాంటి యువజన మరియు విద్యార్థి సంఘాలు సామాజిక బాధ్యతతో విద్యార్థి యువతలో మాంద్రకద్రవ్యాలు మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ద్విచక్ర వాహనాలకు స్టిక్కర్లు అంటిస్తూ ఇలాంటి సేవ కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని వారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక  ఏఎస్ఐ కృష్ణమూర్తి మరియు  సిబ్బంది జానీ, రాంబాబు, లక్ష్మణ్ ,ఈశ్వర్, ఏఆర్ కానిస్టేబుల్ మామిడి థ్రిల్లర్ మంజు, మరియు డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం వినోద్, దేవారం శ్యామ్, సిరికొండ రాకేష్,  కటికోళ్ల ప్రదీప్, సిరికొండ నవీన్, మండవ పవన్ తదితరులు పాల్గొన్నారు.