సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం రేపు

సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం రేపు

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ముఖ్యమంత్రి పదవికి పోటీపడిన పిసిసి అధ్యక్షులు డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. క్యాబినెట్ లోని ఇతర సభ్యుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. సిద్ధరామయ్య,  శివకుమార్ ఈరోజు ఏ ఐ సి సి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఈ విషయంపై చర్చలు జరుపనున్నట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు.