విమానం కూలి ఆరుగురి మృతి

విమానం కూలి ఆరుగురి మృతి

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. మురియెటాలో ఆదివారం తెల్లవారుజామున కూలిన సెస్నా బిజినెస్ జెట్ విమాన ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.  ఫ్రెంచ్ వ్యాలీ విమానాశ్రయానికి సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు మాట్లాడుతూ విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు సైట్‌లో చనిపోయారని తెలిపారు. వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం శాన్ డియాగోకు ఉత్తరాన 65 మైళ్ల దూరంలో కూలిపోయిందన్నారు. పొలంలో విమానం కూలిపోయిందన్నారు. ఈ విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఈ విమానం ఎలా కూలిందనే విషయం ఇంకా తెలియలేదు. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల వివరాలు పూర్తి వివరాలు అందాక వెల్లడిస్తామన్నారు.