పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, టేకుమట్ల మండల కేంద్రాల్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను శనివారం రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పో‌లీసులు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి వివరిస్తూ, పోలీసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, డీజీపీ అంజని కుమార్, భూపాలపల్లి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణీ, గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవష్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ టిఎస్ దివాకర, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.