హరితహారానికి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న సూర్యాపేట మున్సిపాలిటీ

హరితహారానికి రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న సూర్యాపేట మున్సిపాలిటీ
  • మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న చైర్పర్సన్ అన్నపూర్ణ, కమిషనర్ రామానుజుల రెడ్డి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-సూర్యాపేట మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న హరితహారంకు సూర్యాపేట మున్సిపాలిటీ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన విషయం విధితమే. ఈ మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం నాడు హరితోత్సవం ను పురస్కరించుకొని హైద్రాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియం లో  తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ వారు  తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో భాగంగా  సూర్యాపేట మున్సిపాల్టీకి రాష్ట్ర స్థాయి అవార్డు ను అటవీ శాఖా మంత్రి ఎల్లోల .ఇంద్ర కరణ్ రెడ్డి సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,  మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డికి ప్రధానం చేసి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, కమిషనర్ రామానుజుల రెడ్డిలు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో హారిత హారం కార్యక్రమంలో భాగంగా  పెట్టిన పట్టణ ప్రకృతి వనాలు,బృహత్ పట్టణ ప్రకృతి వనాలు, ట్రీ పార్కులు,అవిన్యూ ప్లాంటేషన్ ,చిట్టి అడవులు ఏర్పాటు చేసి పట్టణంలో పచ్చదనం పెంపొందించడము జరిగినందున సూర్యాపేటమున్సిపాల్టీకి  అవార్డు రావడం  జరిగింది అని అన్నారు. తమ కష్టం ఊరికే పోలేదని అందరి సహకారంతో శ్రమకు తగిన గుర్తింపుగా రాష్ట్రస్థాయి అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.