అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..

షాద్ నగర్, ముద్ర: రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీలోని చటాన్ పల్లి రైల్వే గేట్ సమీపంలో  చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. చటాన్ పల్లి సమీపంలోని రైల్వే పట్టాలపై యువకుడు మృతి చెందిన సమాచారాన్ని అందుకున్నామని, ఇందులో భాగంగా సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేయగా ప్రతుడిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా రాజపేట మండలం తిరువూరు గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించామని, యువకుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకుని ఉంది ఉంటాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్  టి.కృష్ణ తెలిపారు.