బీ ఆర్ఎస్ పార్టీకి జై కొట్టిన పేట యువత

బీ ఆర్ఎస్ పార్టీకి జై కొట్టిన పేట యువత
  • మంత్రి జగదీష్ రెడ్డి గెలుపుకై ప్రచారం
  • కారు గుర్తుకు ఓటయ్యాలని స్వచ్చందంగా అభ్యర్దిస్తున్న యువత

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి గెలుపుకై ఎన్నికల ప్రచారంలో మేము సైతం బాగస్వాములవుతామంటూ పేట యువత నడుం బిగించి బీ ఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. జిల్లా కేంద్రంలోని వాడవాడలా కలియ తిరుగుతూ కారు గుర్తుకు ఓటయ్యాలని స్వచ్చందంగా అభ్యర్దిస్తున్నారు. ఈ సందర్బంగా బీ ఆర్ఎస్ వి జిల్లా కో ఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి తో పాటు పలువురు యువకులు మాట్లాడుతూ సూర్యాపేట కు మంత్రి జగదీష్ రెడ్డే సరైన నాయకుడని తమ సమస్యలు బీ ఆర్ఎస్ తోనే పరిస్కారమవుతాయనే నమ్మకముంది తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ లను నమ్ముకుంటే నట్టేట ముంచుతారనే విషయం తమకు అర్ధమైందన్నారు. సూర్యాపేటలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు ఇప్పటికే ఐటీ హబ్ ఏర్పాటు చేసి వందల మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించారని, రాబోయే రోజుల్లో దాన్ని విస్తరించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలిపిస్తామని మంత్రి చెప్పిన మాటకు తామంతా ఫిదా అయినట్లు చెప్పారు. 2014, 2018 లో చెప్పింది చెప్పినట్లు చేసిన మంత్రి జగదీష్ రెడ్డి మాట మీద మాకు పూర్తి నమ్మకముందని  తెలిపారు. అందుకే ఆయన గెలుపుకై ప్రచారం చేయడం గర్వంగా ఉందన్నారు. బి ఆర్ ఎస్ వి జిల్లా కో ఆర్డినేటర్ ముదిరెడ్డి అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు బజార్ నుంచి ప్రారంభమైన ప్రచారం శంకర్ విలాస్ సెంటర్, ఎంజి రోడ్డు, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుదా  ప్రచారం కొనసాగింది. ఈ కార్యక్రమంలో యువకులు సందీప్, అంజి, రవి, శ్రీను, షాబాజి, సంజయ్, విజయ్, మధు, భరత్, శివ, శివాజీ లతో పాటు పెద్ద ఎత్తున యువత ప్రచారం నిర్వహించారు.