60 ఆశీర్వాద సభలు పూర్తి 

60 ఆశీర్వాద సభలు పూర్తి 
  • 33 రోజుల పాటు విస్తృతంగా ప్రచారం
  • ప్రతి సభలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ప్రగతిపై విశ్లేషణాత్మక వివరణ
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే నష్టంపై ఓటర్లకు దిశానిర్దేశం

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాటితో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 60 ఆశీర్వాద సభలను పూర్తి చేశారు. గత నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారాన్ని  ప్రారంభించిన ఆయన 33 రోజుల పాటు ముమ్మరంగా పలు నియోజకవర్గాల్లో  నిర్వహించిన  సభల్లో పాల్గొన్నారు. ప్రతిసారి సాధారణ ఎన్నికలకు ముందు ప్రారంభించినట్టే ఈ సారి ఎన్నికల ప్రచారాన్ని ఆయన  హుస్నాబాద్ నుంచే ప్రజాఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టారు. ఈ సభల్లో ప్రధానంగా  60 ఏండ్లుగా జరగని అభివృద్ధిని పదేళ్లలో చేసి చూపించిన  ప్రగతి ప్రస్థానాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వివరించారు. ప్రతి సభలో గత ప్రభుత్వాలకు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు తేడాలు గుర్తించాలని సూచించారు. సభ ప్రాంగణానికి సీఎం కేసీఆర్ చేరుకునే వరకు ఆటపాటలతో, కళాకారులు వచ్చిన ప్రజలకు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఇందుకు సభ ప్రాంగణాలు సైతం కదం కలుపుతున్నాయి.

తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగుతున్న సమయంలో ఎట్లైతే ప్రతి పల్లె కదిలి వచ్చిందో అంతకు మించిన చైతన్యంతో సీఎం కేసీఆర్ ప్రసంగాలు వినడానికి ఊర్లకు ఊర్లే తరలివస్తున్నాయి. నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రజాఆశీర్వాద సభలకు భారీగా ప్రజలు  తరలివచ్చారు. ముఖ్యంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ తో పాటు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోకి పంటలకు సంబంధించిన డబ్బులు జమ చేయడం వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. గతంలో ఏ పాకులైనా ఇప్పటి వరకూ బీఆర్ఎస్ పాలనలో ఇచ్చినట్లు వేలల్లో పెన్షన్ ఇచ్చారా? అంటూ ప్రజలను నేరుగా అడుగుతున్నారు. ఇక తెలంగాణ గతంలో ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుంది అంటూ ప్రజలకు గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు తాగునీటి ఇబ్బందులు చాలా ఉండేవని, ట్యాంకర్లతో తరలించడం లేకుంటే కిలోమీటర్లు నడిచి బిందెపై బిందె ఎత్తుకుని మంచినీళ్ల కోసం ఆడబిడ్డలు పోయేవాళ్లు అని గుర్తు చేశారు. అప్పుడు తెలంగాణ అట్ల ఉండే ? ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ పైసా ఖర్చు లేకుండా నల్లా నీళ్లు వస్తున్నాయని వివరిస్తున్నారు.


 24 గంటల కరెంటు కావాలా? కాంగ్రెస్ వాళ్లు అంటున్నట్లు 3 గంటల విద్యుత్ కావాలా? అంటూ   కేసీఆర్ ప్రతి సభలోనూ ప్రజలను అడుగుతున్నారు. 24 గంటలు కరెంటు కావాలనుకుంటున్న వాళ్లు చేతులు ఎత్తాలని పేర్కొంటూ ప్రజల్లో ఊషారును నింపుతున్నారు. ధరణి విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న వైనంపై కూడా ప్రతి సభలో కేసీఆర్ ఎండగట్టారు.  దళితబంధు విషయం ప్రస్తావిస్తూ.. దళితబంధులాంటి పథకం పెట్టాలని, ఉచితంగా పది లక్షల సాయం చేయాలని, దళితుల జీవితాలు మార్చాలనే ఆలోచన గతంలో ఎవరైనా ఆలోచించారా? అని అడుగుతున్నారు. గత పాలకులు దళితులను, మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా సంక్షేమ కార్యక్ర