పారంభమైన విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు

పారంభమైన విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు

విశాఖలోని శారదాపీఠం వార్షకోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో అంకురార్పణ జరిగింది. ఐదు  రోజులపాటు రాజశ్యామల యాగం, చతుర్వేద హవనం నిర్వహించనున్నారు.  స్వరూపానందేంద్ర మాట్లాడుతూ పూర్వీకులు ఆస్తిపాస్తులు ఇచ్చినట్లు ఏర్పడిన పీఠం కాదు విశాఖ శారదాపీఠం. ఉపాసనా శక్తితో నిర్మాణమైన పీఠం మాది. ఉపాసనా విధానం పుస్తకాల్లో దొరికేది కాదు. వైదికంగా ఎవరో చెబితే వచ్చేది కాదు. తపస్సు ద్వారా పొందిన శక్తితో పీఠం ఉపాసనా విధానం తయారైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో యావత్‌ భారతావనిలోనే శక్తివంతమైన పీఠంగా గుర్తింపు పొందింది. మాజీ ప్రధాని పీవీ నుంచి అనేకమందికి మహిమలు కనిపించాయని అన్నారు.