‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు - డీఈఓ గోవిందరాజులు

‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు - డీఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూల్ జిల్లా ముద్ర ప్రతినిధి: ఈ నెల 3వ తేదీ  నుంచి  నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈవో డాక్టర్‌ యం. గోవిందరాజులు తెలిపారు. 
విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికా కుండా పరీక్షలు రాయాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు గీతాంజలి పాఠశాలల్లో చేసిన పరీక్షా కేంద్రాలను శనివారం పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు తో కలిసి డిఈఓ గోవిందరాజులు  తనిఖీ చేశారు.  జిల్లాలో పదవ తరగతి పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లాలో 10,572 మంది పరీక్షలు రాస్తున్నారనీ,5180 మంది అబ్బాయిలు,5392 మంది అమ్మాయిలు వారి కోసం 61పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో తెలిపారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డిఇఓ తెలిపారు. 

ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, పరీక్షలు రాసేందుకు అవసరమైన డ్యూయల్‌ డెస్క్‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు. వేసవి దృష్ట్యా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రతి పరీక్షా కేంద్రంలో ఏఎన్‌ఎం ఆధ్వర్యంలో వైద్య బృందం అవ సరమైన మందులతో సిద్ధంగా ఉంటారని తెలిపారు.  ప్రతి పరీక్షా కేంద్రం వద్ద, ప్రశ్నపత్రాల తరలింపులో అవసరమైన మేర పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశామని డిఈవో అన్నారు.  పదో తరగతికి గతంలో 11పరీక్షలున్నాయని, ప్రస్తుతం వాటిని 6 పరీక్షలకు కుదించారని, దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రిఫైనల్‌ పరీక్షలు నిర్వహించామని ఆయన అన్నారు. విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, అవసరమైనవారు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని డిఈవో సూచించారు.

ప్రైవేట్ పాఠశాలలు హాల్ టికెట్లు ఇవ్వని పక్షంలో విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు అని ఆయన తెలిపారు.  విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నారు.  ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కాం పోజిట్‌ కోర్సు, సైన్స్‌ పరీక్షను మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతాయన్నారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కాంపోజిట్‌ కోర్సు, సైన్స్‌ పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరుగు తుందని తెలిపారు. పరీక్ష హాలుకి ఎటువంటి ఎలక్ట్రానిక్స్  వస్తువులు, గాడ్జెట్స్‌ తీసుకువెళ్లడానికి అనుమతి లేదని, పరీ క్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని తెలిపారు. విద్యార్థులందరూ పరీక్ష సమయాన్ని కంటే అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడుపుతున్నట్లు తెలిపారు.  పదవ తరగతి పరీక్షల కోసం జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, సమస్యలు, సందేహాలు ఉంటే కంట్రోల్‌ రూమ్‌ సెల్‌ నెంబర్‌. 9885017701 ఫోన్‌ చేసి తెలపాలని డిఈవో సూచించారు.