24న మంత్రి హరీష్ రాక

24న మంత్రి హరీష్ రాక

ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈనెల 24న మెదక్ జిల్లాలో వివిధ  అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా  పాపన్నపేట మండలంలో నిర్మించిన వివిధ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి పరిశీలించారు.  పాపన్నపేటలో 35 లక్షల ఖర్చుతో రూర్భన్ పధకం క్రింద  నిర్మించిన పశువైద్యశాల, కోటి 20 లక్షలతో చేపట్టనున్న సి.సి.రోడ్డు నిర్మాణ శంఖుస్థాపన పనులను పరిశీలించారు. రామతీర్థంలో నిర్మించిన 56 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, కొత్త లింగాయి పల్లిలో 12 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. మిగిలిపోయిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి ముస్తాబు చేయాలని అధికారులకు సూచించారు. పశు వైద్యశాల, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద పెద్ద మొక్కలు నాటాలని యం.పి.డి.ఓ.కు సూచించారు. 
అనంతరం మెదక్ పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియాన్ని పరిశీలించి సిఎం. కప్-2023 ముగింపు క్రీడల్లో మంత్రి పాల్గొంటారు. ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో జిల్లా మహిళ సమాఖ్య భవన  నిర్మాణ శంఖుస్థాపన ఏర్పాట్లను, మాయా గార్డెన్ లో రెండవ విడత గొర్రెల పంపిణిపై అవగాహన సదస్సు సభా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా అధికారులు వెంకట శైలేష్, చందు నాయక్, సాయిబాబ, సత్యనారాయణరా రెడ్డి, కృష్ణమూర్తి, రాధాకిషన్, ఆర్.డి.ఓ. సాయి రామ్, మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, జిల్లా యువజన సంక్షేమాధికారి నాగరాజ్, డిఎస్పీ సైదులు, తహసీల్ధార్లు గంగాప్రసాద్, హరిదీప్ సింగ్, శ్రీనివాస్  తదితరులున్నారు.