ప్రశ్న పత్రాల లికెజికి బాధ్యత వహించి  టి ఎస్ పి ఎస్ చైర్మన్ రాజీనామా చేయాలి

ప్రశ్న పత్రాల లికెజికి బాధ్యత వహించి  టి ఎస్ పి ఎస్ చైర్మన్ రాజీనామా చేయాలి

ముద్ర, కోనరావుపేట: ప్రశ్న పత్రాల లికెజికి బాధ్యత వహించి టి ఎస్ పి ఎస్ చైర్మన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్ మరియు లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బానోతు నరేష్ నాయక్ లు అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రశ్న పత్రల లికేజివిషయం పై నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత మరియు విద్యార్థులు గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ కొరకు ఎదురుచూస్తూ, వివిధ కోచింగ్ సెంటర్లలో,తల్లిదండ్రులు కూలి నాలి చేసుకొని చెమటోడ్చిన డబ్బులతో ,లక్షల రూపాయలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకుంటూ, ఉన్న నేపథ్యంలో లేక లేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఎస్పిఎస్సి ద్వారా ఇటీవల  విడుదల చేసిన నోటిఫికేషన్ తో విద్యార్థులు ఎంతో శ్రమించి రాత్రింబగళ్లు తమ ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా, చదువుతూ, ఒక్క ఉద్యోగం సంపాదించుకుంటే చాలు అని ఎంతో ఆసక్తితో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమార్కులు పేపర్ ప్రశ్నా పత్రాలు లీక్ చేసి అంగట్లో అమ్ముకొని, అనేక నిరుద్యోగుల జీవితాలను రోడ్డుపాలు చేసే పరిస్థితి ఏర్పడింది, నిరుద్యోగుల విలువైన సమయాన్ని వృధా చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడారు,ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత,  అక్రమార్కులు పంపకాల్లో తేడా రావడంతోనే బయటపడినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

దీన్ని బట్టి చూస్తే టీఎస్ పి ఎస్సి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు, ఈ ఘటన చూస్తుంటే ఇదివరకు కూడా టీఎస్పీఎస్సీ ద్వారా వెలువడిన గ్రూప్ 1 నోటిఫికేషన్ లో కూడా ప్రశ్నాపత్రాలు ఏమైనా లీక్ చేసి ఉంటారనే అనుమానం కూడా ఉంది. కనీసం ఆ బోర్డులో ఏం జరుగుతుందో తెలుసుకోలేని దుస్థితిలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నందున చైర్మన్ ను వెంటనే సస్పెండ్ చేసి, టిఎస్పిఎస్సి యొక్క పేపర్ల లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఈ ప్రశ్నాపత్రం పేపర్ లీకేజ్ కారకులైన వారందరినీ కఠినంగా శిక్షించి ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు 5000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా నాయకులు సుకుమార్, లైవ్ నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.