టిఆర్ఎస్ మళ్లీ వస్తే బతుకమ్మపై కవిత లిక్కర్ పెడుతుంది..

  • నాడు ఎలిజిబెత్ క్వీన్ ఉండే కానీ కవిత ఇప్పుడు లిక్కర్ క్వీన్
  • జగిత్యాల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కవిత పై వివాదాస్పద వ్యాఖ్యలు.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పలువార్డులలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే... ఎనుకట ఎలిజబెత్ క్వీన్  ఉన్నట్లు ఇప్పుడు లిక్కర్ క్విన్ వచ్చింది. ఇది ఆమె కవిత. ఆడబిడ్డలకు ఆమె ఉద్బోధ.. తప్పిపోయి మల్ల గిన టిఆర్ఎస్ వస్తే బతుకమ్మ పైన లిక్కర్ బాటిల్ పెడుతుంది. మనము బతుకమ్మ పైన గుమ్మడి పువ్వు గౌరమ్మ పెడతాం.... ఆమెకు తెలుసో తెలియదో నాకు తెలియదు.. నేను చిన్నప్పుడు మా అమ్మగారింట్లో నేను ఆడుకునే వాడిని.. గుమ్మడి పువ్వు గౌరమ్మ పెడతారు. కవిత ఏం చేస్తుంది విస్కీ బాటిల్ గౌరమ్మ పెడితది. అట్ల తయారవుతుంది రాజ్యం. ఆమె నాకు బోధ చేస్తది. కవిత ఎంపీగా జగిత్యాలకు చేసిన అభివృద్ధి ఏమి లేదని.. ఐదేళ్ల కాలంలో ఏం చేసిందో చెప్పాలని  అన్నారు. షుగర్ ఫ్యాక్టరీలను తెలపించడం కాదు... మెట్ పల్లిలో నడుస్తున్న షుగర్ ఫ్యాక్టరీని కవితే మూసి వేయించిందన్నారు. 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడం కాంగ్రెస్ విధానం అన్నారు. రాహుల్ గాంధీని కవిత ఎలక్షన్ గాంధీ అనడాన్ని జీవన్ రెడ్డి తప్పుపట్టారు. రాహుల్ గాంధీ మార్గదర్శకుడని వరికి మద్దతుగా అదనంగా రూ.500   ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు.  గ్రూప్ వన్ ఉద్యోగాలు అంగట్లో సరుకులు అయ్యాయని ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రూప్ వన్ పరీక్ష రెండు సార్లు నిర్వహించడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జగిత్యాల లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కల్పిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా థై బజార్   అంగడి చిట్టిని అన్ని మున్సిపాలిటీ రద్దు చేస్తామన్నారు.