పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు జరగాలి..

పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు జరగాలి..
  • జిల్లా ప్రగతిని ప్రజలకు చాటి చెప్పాలి..
  • మంత్రి సత్యవతి రాథోడ్ ..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: పండుగ వాతావరణంలో Decade celebrations of Telangana State తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరగాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల పై  సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆయా జిల్లాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగిందన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొమ్మిది సంవత్సరాల స్వయం పాలన పూర్తి చేసుకుని 10వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి 22 వరకు, మొత్తం 21 రోజుల పాటు దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.  శతాబ్ది  కాలంలో జరగని అభివృద్ధి కేవలం దశాబ్ది కాలంలోనే జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సన అవసరం ఉందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని బాగస్వామ్యం చేసుకోవాలని, మనం సాధించిన ఘనత దేశ వ్యాప్తంగా చాటేలా నిర్వహణ ఉండాలని అన్నారు. 

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులు తగిన ఏర్పాట్లను చేయాలని, గ్రామాలలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఈ వేడుకలు నిర్వహించుకునే విధంగా ప్రణాళిక ఉండాలని మంత్రి కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కల్లెపు శోభ, జిల్లా కలెక్టర్  భవేశ్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ఎస్పీ సురేందర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి లావణ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు హింగె మహేందర్, జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, పీఏసీఎస్ చైర్మన్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.