రద్దయిన సర్వీస్​ కమిషన్​ పరీక్షలకు మళ్లీ ఫీజులు కట్టక్కరలేదు

రద్దయిన సర్వీస్​ కమిషన్​ పరీక్షలకు మళ్లీ ఫీజులు కట్టక్కరలేదు

టీఎస్​పీఎస్సీ ద్వారా  పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ ఐటీ, మున్సిపల్​ శాఖల మంత్రి కేటీఆర్​ అన్నారు. పరీక్ష పేపర్లు లీకైన నేపథ్యంలో శనివారం ఆయన మీడియా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  8 ఏళ్లుగా ఇండియాలోనే అత్యధికంగా ఉద్యోగాల నియామకం జరిపిన కమిషన్ టీఎస్​పీఎస్సీ అని చెప్పారు.  గతంలో ఏపీపీఎస్సీపై  పై  అనేక ఆరోపణలు వచ్చాయన్నారు.  టీఎస్​పీఎస్సీ  ఇప్పటి వరకు 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని, - ఒక్క ఆరోపణ  కూడా రాలేదని అన్నారు. టీఎస్​పీఎస్సీలో  ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పుల కారణంగా  మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందన్నారు.  రాష్ట్ర యువతకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.  నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనకాల ఎవరు ఉన్నా వాళ్ళ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునే భాద్యత తమపై ఉందన్నారు.  మళ్ళీ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ కాకుండా పూర్తి చర్యలు తీసుకుంటామన్నారు.  రద్దు అయిన పరీక్షలకు ఫీజు కట్టిన యువత మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదన్నారు.  గతంలో అప్లై చేసుకున్న వాళ్లంతా అర్హునని కేటీఆర్​ చెప్పారు.  పరీక్షల మెటీరియల్ అంతా ఆన్లైన్ లో పెడతామని ,  దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. స్టడీ సర్కిల్స్ ను బలోపేతం చేస్తూ- రీడింగ్ రూమ్స్ 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.