నర్సింహచారి సేవలు అభినందనీయం - మాజీ స్పీకర్ మధుసూదనాచారి

నర్సింహచారి సేవలు అభినందనీయం -  మాజీ స్పీకర్ మధుసూదనాచారి

ముద్ర ప్రతినిధి, జనగామ:విశ్వబ్రాహ్మణులకు నర్సింహచారి చేసిన సేవలు అభినందనీయమని తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు.విశ్వబ్రాహ్మణ సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు దీగోజు నర్సింహచారి, విజయ దంపతుల షష్టిపూర్తి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఎర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశ్వబ్రాహ్మణులను‌ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన నర్సింహచారి విశ్వబ్రాహ్మణుల ఐక్యత కో ఎంతగానో కృషి చేశార‌న్నారు. 

షష్టిపూర్తి సందర్భంగా రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో‌ అన్నదానం, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు‌. సాయిరాం కన్వెన్షన్ హాల్ లో విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం వివిధ సామాజిక సేవారంగంలోని ప్రతిభా మూర్తులకు "విశ్వకర్మ తేజోరత్న" పురస్కారాలు ప్రదానం చేశారు.బర్త్ డే ట్రీ ఫౌండేషన్ అధ్యక్షుడు,రాష్ట్రస్థాయి హస్త కళ అవార్డు గ్రహీత అయిలా సోమనర్సింహచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు లాలుకోట వెంకటాచారి, వేములవాడ మదన్ మోహన్, చొల్లేటి కృష్ణమాచారి, జనగామ జిల్లా విశ్వకర్మ కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు దీగోజు సాంబయ్య చారి, కవులు కళాకారుల ఐక్యవేదిక‌ కన్వీనర్‌ జి.కృష్ణ,కవి హృదయ సాహిత్య వేదిక అధ్యక్షుడు పెట్లోజు సోమేశ్వరాచారి, సంగీత, కళాకారులు చిలుమోజు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.