ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు...

ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు...

ముద్ర,గంభీరావు పేట:-గంభీరావుపేట  మండల కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ లో  సోమవారం ప్రభుత్వ  జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  జ్ఞాన చారి,సిరి సిల్ల గర్స్ కళాశాల  అధ్యపకులు బాల ప్రసాద్, రామాంజనేయులు, మా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నర్సా గౌడ్ హాజరై విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలని, అలాగే పోటి ప్రపంచంలో విద్య తో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే చదివిన చదువుకు సార్ధకత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్  వెంకటనాయక్,  అధ్యాపకులు   శ్రీధర్, శ్రీనివాస్,వెంకన్న, నాంపల్లి, గజానంద్, కవిత, పాపారావు, సంతోష్, సునులత భామ డకాష్, రాజు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.