వర్షానికి కూలిన ఇల్లు

వర్షానికి కూలిన ఇల్లు

ముషీరాబాద్, ముద్ర:రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా కవాడిగూడలో  ఇల్లు కూలిపోయింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. కవాడిగూడ డివిజన్ పరిధిలోని ఎరుకల బస్తీలో ఉన్న పాత ఇల్లు కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా ఇంట్లో ఎవరూ లేకపోవడం, పక్కన ఓ ఇల్లు నిర్మాణంలో ఉండడం వల్ల పెను ప్రమాదం తప్పింది. బస్తీలో ఉన్న మరిన్ని పాత ఇళ్లను వెంటనే తొలగించాలని స్థానిక బస్తీవాసులు జిహెచ్ఎంసి అధికారులను  కోరుతున్నారు.