వేములవాడలో ఘనంగా ఐటిఎఫ్ బోనాల జాతర

వేములవాడలో ఘనంగా ఐటిఎఫ్ బోనాల జాతర
ITF bonala fair in Vemulawada

బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించిన యూట్యూబర్స్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ (ఐటిఎఫ్) ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూట్యూబర్స్... కళాకారులు యూట్యూబ్ తల్లి గూగులమ్మ బోనాలు పేరున బద్దిపోచమ్మకు బోనాలను  సమర్పించారు. యూట్యూబ్ గూగుల్ తో ఉపాధి పొందుతున్న కళాకారులు... నటీనటులు, యూట్యూబ్ గూగుల్ సంస్థల తరఫున కళాకారులు బోనాలను బద్దిపోచమ్మ సమర్పించారు.

కళాకారుల ఆటపాటలతో వేములవాడ పురవీధులు మారుమోగాయి. కళాకారులు యూట్యూబ్ స్టార్స్ తమ ఆటో పాటలతో అల్లరించారు. భక్తిశ్రద్ధలతో బోనాల జాతర నిర్వహించారు. ప్రముఖ నాయకురాలు తేలి విజయ, స్వర్ణ, మధుప్రియ, మౌనిక యాదవ్, మాట్ల తిరుపతి, జి ఎల్ నాందేవ్, మామిడి మౌనిక, శిరీష, వడ్లకొండ అనిల్, మల్లిక్ తేజ, బుర్ర నటరాజ్, మారం ప్రవీణ్ తదితరులు ఈ బోనాల జాతరలో పాల్గొన్నారు.