ఇఫ్తార్ విందులు స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయి

ఇఫ్తార్ విందులు స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయి

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని గంగా జమున తెహజీబ్ కు ప్రతిరూపంగా మారుతాయని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుస్సేనీ పురలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులకు ఖర్జూరాలు, పండ్లు తినిపించి  రోజాను విరమింపజేశారు. అనంతరం సహాపంక్తి భోజనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు స్నేహబంధాన్ని పెంపొందిస్తాయని, హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయన్నారు.

పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ మెప్పు కోసం నెలరోజుల పాటు కఠోర మైన ఉపవాస దీక్షలు పాటించి,నెల రోజులు ఖురాన్ పారాయణం, తరవీహ్ నమాజ్ క్రమం తప్పకుండా ఆచరించి పుణ్య ఫలాలు పొందడం గొప్ప ధార్మిక సంకల్పమని కొనియాడారు. మనిషి జీవితంలో సంపాదన,డబ్బు కంటే ఆధ్యాత్మిక చింతనే ముఖ్యమన్నారు. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో సర్వమతాలకు అన్ని విధాల ప్రాధాన్యం ఉండేదని నేడు అది కనిపించడం లేదన్నారు. అనంతరం ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి  పూలమాలలు, శాలువాతో ఇస్లామీయ సంప్రదాయ బద్దంగా ముస్లిం సోదరులు  ఆత్మీయ సన్మానం చేశారు. దావాతే ఇఫ్తార్ అనంతరం 2000 మందికి రుచికరమైన బోజనాలను ఏర్పాటు చేశారు. షబానా మహమ్మద్,హనీఫ్,మహమ్మద్ అబ్దుల్ భారీ,మహమ్మద్ సిరాజొద్దిన్, జాఫర్, ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఎండి తాజ్,సమద్ నవాబ్,కమ్రొద్ధిన్, అక్బర్ అలీ, నదీo,మంజూరలి, ఖాజా మోయినొద్దిన్,గుండాటీ శ్రీనివాస్ రెడ్డి,శ్రవణ్ నాయక్,  చర్ల పద్మ,లింగంపల్లి బాబు, పోరాండ్ల రమేష్,ముక్క భాస్కర్, అనిల్ కుమార్ తది తరులు పాల్గొన్నారు.