రేపటి నుంచి తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..

రేపటి నుంచి  తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఫిక్స్ అయింది. రేపటి నుంచే తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా… ఎగ్జామ్ సెంటర్ లోకి రాణిచ్చేది లేదని అధికారులు చెబుతున్నారు.రేపటి నుంచి జూన్ మూడవ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 90 పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరుగుతాయి.అలాగే మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ఐదున్నర గంటల మధ్య ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. నిమిషo ఆలస్యం అయినా సరే పరీక్షకు అనుమతించేది లేదని చెబుతున్నారు అధికారులు. తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.