తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా కడియం రామచంద్రయ్య

తుంగతుర్తి నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా కడియం రామచంద్రయ్య

తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గానికి చెందిన నాగారం గ్రామస్తుడు కడియం రామచంద్రయ్యకుమొదటి జాబితాలోనే టికెట్ కేటాయించారు .కడియం రామచంద్రయ్య 2018 సంవత్సరం నుండి తుంగతుర్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారుగడచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బిజెపి టికెట్ రామచంద్రయ్యకి దక్కింది. నాటి నుండి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం రామచంద్రయ్య కృషి చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో రామచంద్రయ్యకు సుమారు 3000 ఓట్లు రావడం జరిగింది . ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ జియాలజీ పట్టా పొందిన రామచంద్రయ్య బీఈడీ సైతం పూర్తి చేసుకున్నారు. పలు ప్రభుత్వ ఉద్యోగాలలో కొనసాగిన రామచంద్రయ్య అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ మరియు జియాలజీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యారు. రామచంద్రయ్య మృదుస్వభావి .2018 ఎన్నికల నాటి వాతావరణం మార్పు జరిగి బిజెపి రాష్ట్రంలో కొంత మేర బలం  పుంజుకోవడం అలాగే తుంగతుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు సైతం బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా ఉండడం రామచంద్రయ్యకు కొంతమేర కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు .సంకినేని వెంకటేశ్వరరావు సైతం సూర్యాపేట నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి స్థానికుడైన వెంకటేశ్వరరావుకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఈ ఎన్నికల్లో రామచంద్రయ్యకు పూర్తిస్థాయిలో వెంకటేశ్వరరావు మద్దతు తెలుపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో బిజెపి గణనీయమైన ఓటు బ్యాంకు పెంచుకోనున్నదని  మాట వినవస్తుంది .బి ఆర్ ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాత విపక్ష పార్టీల నుండి ప్రకటించబడ్డ రెండవ అభ్యర్థి రామచంద్రయ్య. భారతీయ జనతా పార్టీ తన మొదటి జాబితాలోనే తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడం పట్ల నియోజకవర్గ బిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటించిన రామచంద్రయ్య త్వరలో రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు . తెలుస్తోంది ఏది ఏమైనా ఎన్నికల్లో రామచంద్రయ్య ఏ మేరకు అధికార పార్టీ అభ్యర్థిని నిలువరించగలరో వేచి చూడాల్సిందే.