అత్యంత ‘ధనిక గ్రామీణ’ రాష్ట్రంగా కేరళ...

అత్యంత ‘ధనిక గ్రామీణ’ రాష్ట్రంగా కేరళ...

ముద్ర,సెంట్రల్ డెస్క్:-భారతదేశంలో అత్యంత సంపన్న గ్రామాలు ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. తాజాగా నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్.ఎస్.ఎస్) ఆఫీస్ విడుదల చేసిన గృహ వినియోగ వ్యయ నివేదిక ఈ విషయాన్ని తెలియజేసింది. వస్తువులు మరియు సేవలపై గ్రామీణ కేరళలో ఒక ఇంటి సగటు నెలవారీ వ్యయం రూ.5924.

కాగా అత్యంత సంపన్న పట్టణ ప్రాంతాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణా నిలిచింది. తెలంగాణ  పట్టణ ప్రాంతాల్లో రూ.8158 నెలవారీ వినియోగ వ్యయంగా ఉంది.  గత 10 సంవత్సరాల(2012 నుండి 2023 వరకు) గణాంకాలకు సంబంధించిన నివేదికను ఎన్.ఎస్.ఎస్ విడుదల చేసింది. కేరళలో సిపిఎం ఆధ్వర్యంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటి తదితర రంగాలలో సాధిస్తున్న విజయాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.