13  రాష్ట్రాల గవర్నర్ల మార్పు..! | Mudra News

13  రాష్ట్రాల గవర్నర్ల మార్పు..! | Mudra News
  • ఇద్దరికి కొత్తగా ఛాన్స్​
  • ఏపీ గవర్నర్ గా ఎస్. అబ్దుల్ నజీర్
  • ఛత్తీస్ గఢ్ కు బిశ్వభూషన్ బదిలీ


న్యూఢిల్లీ: 
దేశంలోని 11 రాష్ట్రాల గవర్నర్లను మారుస్తూ రాష్ట్రాపతి కార్యాలయం ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇద్దరిని కొత్తగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్. అబ్దుల్​నజీర్ ను నియమించారు. అయోధ్య బాబ్రీ మసీదు వివాదం,  ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు తదితర కీలక కేసులలో తీర్పునిచ్చిన ధర్మాసనంలో జస్టిస్ నజీర్ సభ్యులుగా ఉన్నారు. 1958 జనవరి ఐదున కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. 1983 నుంచి 2003 వరకు హైకోర్టు న్యాయవాదిగా పని చేశారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జనవరి ఐదున సుప్రీం జడ్జిగా రిటైరయ్యారు.  ఇక్కడ ఇప్పటి వరకు గవర్నర్ గా ఉన్న బిశ్వభూషన్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేశారు. మహారాష్ర్ట గవర్నర్ గా రమేష్​ బైస్​నియమితులయ్యారు. ఇక్కడ ఇప్పటి వరకు గవర్నర్ గా ఉన్న కోశ్యారీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. సిక్కింకు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, హిమాచల్ ప్రదేశ్ కు​శివప్రసాద్​ శుక్లా, అరుణాచల్​ప్రదేశ్ కు జనరల్ త్రివిక్రమ్​ పట్నాయక్​, ఝార్ఖండ్ కు సీపీ రాధాకృష్ణన్, మేఘాలయకు ఫగు చౌహాన్​, అస్సాంకు గులాబ్ చంద్​కటారియా, మణిపూర్ కు అనసూయ ఉయ్ కే, బిహార్ కు​ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్, నాగాలాండ్ కు గణేషన్ ను ​గవర్నర్లుగా నియమితులయ్యారు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా బ్రిగేడియర్ బీడీ మిశ్రాను నియమించారు. వచ్చే యేడాది జరుగనున్న ఎన్నికల నేపథ్యంలోనే గవర్నర్ల మార్పు జరిగిందనే అభిప్రాయాలున్నాయి. ఒకేసారి భారీ ఎత్తున గవర్నర్‌లను మార్చడం వెనుక కేంద్రం, బీజేపీ ఉద్దేశ్యం ఏమై ఉంటుందని ప్రతిపక్షాలు తీవ్ర ఆలోచనలో పడ్డాయి.